మెరుగైన వైద్య సేవలే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్య సేవలే లక్ష్యం

Published Sun, Jan 19 2025 12:16 AM | Last Updated on Sun, Jan 19 2025 12:16 AM

మెరుగైన వైద్య సేవలే లక్ష్యం

మెరుగైన వైద్య సేవలే లక్ష్యం

మక్తల్‌: మక్తల్‌లో 10 ఎకరాల్లో 150 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ఈ నెల 21న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించడంతోపాటు ప్రభుత్వాస్పత్రిలో వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 150 పడకల ఆస్పత్రి కోసం 10 ఎకరాలకు అదనంగా మరో 5 ఎకరాలు స్థలం కేటాయించడం జరిగిందని, ఈ స్థలంలో అత్యాధునిక పరికరాలు, వసతులతో ఆస్పత్రిని నిర్మించనున్నామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ సౌభాగ్యలక్ష్మి, కమిషనర్‌ బోగేశ్వర్‌, తహసీల్దార్‌ సతీస్‌కుమార్‌, డాక్టర్‌ వినుత, రవికుమార్‌, కట్టసురేస్‌, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement