ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలి
నారాయణపేట: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం మందులు ఏవిధంగా సరఫరా చేయాలనే దానిపై డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో డీఎంహెచ్‌ఓ సౌభాగ్యలకి్‌ష్మ్ శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి పార్మాసిస్ట్ మూడు నెలలు ముందుగానే అవసరమైన మందుల కోసం ఇండెంట్ ఆన్‌లైన్ పొర్టల్‌లో సీఎంఎస్‌కి ఆప్లయ్ చేయాలన్నారు. మందులను సరిగ్గా చూసుకొని పీహెచ్‌సీ, సబ్‌సెంటర్‌లకు, పేషెంట్స్ కి అందించే బాధ్యత ప్రతి ఫార్మాసిస్ట్ మీద ఉందన్నారు. గడువు ముగిసే మూడు నెలలు ముందే మందులు ఎన్ని ఉన్నాయో చూసుకుని వాటిని మొదటగా ఖర్చు చేయాలన్నారు. జిల్లాలో మందుల కొరత లేకుండా చూసుకొని ప్రతి పెషేంట్ కి మందులు అందుబాటులో ఉండేవిధంగా చూసుకోవాల్సిన బాధ్యత పిహెచ్‌సీల వైద్యాధికారుల మీద ఉందని వివరించారు. కార్యక్రమంలోవైధ్యాధికారులు సాయిరాం. శైలజ,రాఘవెందర్‌రెడ్డి, డిపిఓ బిక్షపతి ఫార్మసిస్టులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment