నారాయణపేట రూరల్: క్షేత్రస్థాయిలో వైద్యసేవలు అందిస్తున్న ఆశావర్కర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం మంగళవారం నారాయణపేట మండలం అప్పంపల్లి నుంచి జిల్లా కేంద్రం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకు లు వెంకట్రాంరెడ్డి, బలరాం మాట్లాడుతూ.. ఆశావర్కర్లపై రోజురోజుకు పనిభారం పెరుగుతుందన్నారు. వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించి.. రూ. 18వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో ఆశావర్కర్లు సమ్మె చేపట్టగా.. తాము అధికారంలోకి వస్తే సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆశావర్కర్లకు పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ట్రైనింగ్ పూర్తిచేసుకున్న వారికి ఏఎన్‌ఎంలుగా పదోన్నతి కల్పించాలన్నారు. రిటైర్డ్‌మెంట్ బెనిఫి ట్స్ రూ. 5లక్షలు, బీమా రూ. 50లక్షలు, దహన సంస్కారాలకు రూ. 50వేలు అందించాలని కోరా రు. ఆదివారం, పండగ సెలవులను అమలు చేయాలన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ జయసుధకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయ కులు నరహరి, పవన్, మహేందర్, హనుమంతు, శివకుమార్, యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బాలమణి, గౌరమ్మ, ఉమాదేవి రేణుక, భాగ్యమ్మ, కల్పన, స్వాతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment