నిర్మలమ్మ.. కరుణించేనా! | - | Sakshi
Sakshi News home page

నిర్మలమ్మ.. కరుణించేనా!

Published Sat, Feb 1 2025 1:43 AM | Last Updated on Sat, Feb 1 2025 1:43 AM

నిర్మ

నిర్మలమ్మ.. కరుణించేనా!

వివరాలు 8లో u

మ్మడి జిల్లాలో పర్యాటక అభివృద్ధికి విస్త్రృత అవకాశాలు ఉన్నా నిధులు, ప్రోత్సాహం లేక ఆశించినంత పురోగతి సాగడం లేదు. నల్లమల అటవీప్రాంతం, సుందరమైన కృష్ణాతీర ప్రాంతాలు, పురాతన దేవాలయాలతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పర్యాటకాభివృద్ధికి అవకాశం ఉన్నా ఆ దిశగా దృష్టిపెట్టడం లేదు. ఉమ్మడి జిల్లాలోని దర్శనీయ ప్రదేశాలతో టూరిజం సర్క్యూట్‌గా తీర్చిదిద్దాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సాక్షి, నాగర్‌కర్నూల్‌:

కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ఉమ్మడి జిల్లావాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లోనే ఉన్న రైల్వే ప్రాజెక్టులకు ఈసారైనా నిధులు కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జాతీయ రహదారుల విస్తరణ, కొత్తగా రోడ్ల నిర్మాణానికి నిధులు అందజేస్తారన్న అంచనాలు ఉన్నాయి. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతున్నా.. నిరాశే ఎదురవుతుంది. ఈ ప్రాజెక్ట్‌ పనులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను ఇవ్వాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ విషయంలో ప్రతిసారి కేంద్రం నుంచి రిక్తహస్తం ఎదురవుతోంది. ఈసారైనా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉమ్మడి జిల్లాకు నిధులు అందుతాయన్న ఆశలు నెలకొన్నాయి.

ఉమ్మడి జిల్లామీదుగా వెళ్లే హైదరాబాద్‌–బెంగళూరు జాతీయ రహదారి ఎన్‌హెచ్‌–44ను ఇండస్ట్రియల్‌ కారిడార్‌గా అభివృద్ధి పరుస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే ఇందుకు అవసరమైన అడుగులు మాత్రం ముందుకు పడలేదు. అలాగే హైదరాబాద్‌–శ్రీశైలం జాతీయ రహదారిపై సుమారు 63 కి.మీ. మేర ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం చేపట్టాలని కేంద్రం ప్రతిపాదించింది. ఇందుకోసం పనులు డీపీఆర్‌ దశలో ఉన్నాయి. కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు జాతీయ రహదారి పనులు ప్రారంభమైనా, సోమశిల వద్ద ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలుకాలేదు. టెండర్‌ ప్రక్రియను పూర్తిచేసి పనులను వేగవంతం చేయాల్సి ఉంది. నల్లమలలోని పదర మండలం మద్దిమడుగు వద్ద కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మించి ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలను మరింత సులభం చేయాలన్న అంశం ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది.

పర్యాటక అభివృద్ధికి ఊతం ఇచ్చేనా?

రహ‘దారుల’పై ఆశలు..

కేంద్ర బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి

ఉమ్మడి

పాలమూరుకు ఏటా నిరాశే

పాలమూరు–

రంగారెడ్డి

ప్రాజెక్ట్‌కు సాయం అందేనా?

పరిశ్రమలు కరువు..

వలసల జిల్లాగా పేరొందిన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు పెద్దగా పరిశ్రమలను ఏర్పాటు చేయలేదు. పెద్ద సంఖ్యలో స్థానికులకు ఉపాధి కల్పించడంతో పాటు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఉపాధి కల్పనకు ఎలాంటి పరిశ్రమలు లేకపోవడంతో ఇంకా హైదరాబాద్‌, ఇతర జిల్లాలకు వలసలు కొనసాగుతున్నాయి. విద్యాభివృద్ధికి అవసరమైన నిధులతో పాటు కేంద్రం నుంచి కొత్త జిల్లాలకు నవోదయ, కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేస్తే ప్రయోజనం కలుగనుంది. నారాయణపేటలో మంజూరైన సైనిక్‌ పాఠశాల అభివృద్ధికి నిధులు కేటాయించాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
నిర్మలమ్మ.. కరుణించేనా! 1
1/1

నిర్మలమ్మ.. కరుణించేనా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement