లోహియా కులాంతర వివాహాలయితేనే∙ఏ పెళ్లికయినా వెళ్లేవారు. విడాకులను సమర్థించారు. ఆస్తికి ఆయన వ్యతిరేకి. దానిని ఆచరణలో చూపించారు కూడా. ఆయన హరిజన దేవాలయాలకూ వెళ్లారు. జాతికి కొత్త జవ జీవాలను తీసుకురావడానికి ఆయన తాను చేయగలిగిందంతా చేశారు. ఆయన తన యాభై ఏడేళ్ల జీవితంలో మొత్తం ఇరవై సార్లు అరెస్టు అయినట్లు ఎక్కడో చదివాను.
చదవండి: ఉక్కు మహిళకు తగిన మహిళ.. కిరణ్ బేడి
లోహియా ఢిల్లీ వార్తాపత్రికలకు పెద్ద పెద్ద ఆదర్శాలతో వ్యాసాలు రాయడానికే పరిమితం కాలేదు. పేదల కోసం తన పోరాటాన్ని స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగించారు. బహుశా అందుకే కావచ్చు మొత్తం 20 అరెస్టుల్లో 12 అరెస్టులు స్వాతంత్య్రం వచ్చాకే జరిగాయి! ఆయన బాగా చదువుకున్న, బాగా పర్యటనలు చేసిన రాజకీయ నాయకుడు.
డాక్టర్ లోహియా అనే పేరులోని డాక్టర్ అనే మాట ఆయన చేసిన పరిశోధనలకు లభించింది. బెర్లిన్ నుంచి ఎకనామిక్స్‌లో ఆయనకు డాక్టరేట్ లభించింది. అప్పుడు ఆయన వయసు 23 ఏళ్లు. పరిశోధనను జర్మనీ భాషలో చేశారు. బ్రిటన్‌లో చదువుకోడానికి ఆయన ఆసక్తి చూపలేదు. కులం, మతం, జాతి, రాజకీయాలు, సంగీతం, కళలు, అర్థశాస్త్రం, రాజ్యాంగం, న్యాయశాస్త్రం, సాహిత్యం వంటి అంశాలను సమదృష్టితో పరిశీలించి, విమర్శించారు.
ఆయన ఢిల్లీలోని రాకబ్‌గంజ్‌లో ఉన్న తన ఇంటి తలుపులను అందరికీ ఎప్పుడూ తెరిచే ఉంచేవారు. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి తన మాట్లాడవచ్చు. మా నాన్నగారు, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో ఆయనకు సహచరుడు. ఆయన తరచు లోహియా ఇంటికి వెళుతుండేవారు. లోహియా హిందీ, ఉర్దూ, బెంగాలీ, ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో అనర్ఘళంగా మాట్లాడుతుండేవారు.
ఇంగ్లిషు మీద ఆయన పోరాటం సాగించినప్పటికీ, ఆ భాషలో కూడా నిష్ణాతుడే. ‘‘ప్రపంచంలో ఎక్కడ చూసినా చిన్న, పెద్ద మనుషుల మధ్య అసమానతలు ఉంటూనే ఉన్నాయి. అయితే భారతదేశంలో ఈ అంతరం మరీ దుర్భరంగా ఉంటోంది’’ అని ఆయన ఆవేదన చెందేవారు. ఆయన బతికి ఉంటే ఇప్పుడు కూడా జైల్లోనే ఉండేవారేమో.
– నిరంజన్ రామకృష్ణ, లోహియా వెబ్‌సైట్ రూపకర్త
Comments
Please login to add a commentAdd a comment