నా భార్యకు 8 మంది భర్తలు | Bengaluru Man Accuses Wife of Marrying Eight Men | Sakshi
Sakshi News home page

నా భార్యకు 8 మంది భర్తలు

Published Thu, Sep 12 2024 7:01 AM | Last Updated on Thu, Sep 12 2024 11:28 AM

Bengaluru Man Accuses Wife of Marrying Eight Men

     కోర్టులో ఓ వ్యక్తి చీటింగ్‌ కేసు 

శివాజీనగర: ఓ వ్యక్తి తన భార్య 8 మందిని వివాహం చేసుకొందని, చీటింగ్‌ చేసిందని బెంగళూరులో హైకో­ర్టు మెట్లెక్కాడు. వివరాలు.. హొసపేటెకు చెందిన రాజా హుసేన్‌ అనే వ్యక్తి తన భార్య తనకు తెలియకుండా 8 మందిని పెళ్లాడింది. నాతో తలాక్‌ కూడా తీసుకోలేదు అని కేసు వేశాడు. బుధవారం ఈ కేసులో వా­ద­­నలు జరిగాయి. మహిళ తరఫు న్యాయవాది ఈ ఆరోపణలు అబద్ధమని, తొలి భర్త మరణించిన తరువాత ఆమె రెండో వివాహం చేసుకొన్నది. 

తరువాత తలాక్‌ పొందకుండా మరొకరిని మాత్రం  పెళ్లాడిందని వాదించారు. పిటిషనర్‌ న్యాయవాది వాదిస్తూ ఆమె 8 మందిని పెళ్లి చేసుకోవడం నిజమని, ఐదు మంది భర్తలు గత వాయిదాలో నేరుగా కోర్టుకు హాజరయ్యారని చె­ప్పా­రు. సమయం లేకపోవడం వల్ల మిగతా ముగ్గు­రు కోర్టుకు రాలేకపోయారంటూ వారు ఇచ్చిన ధృవీకరణ పత్రాలను సమర్పించారు. ఆమె మోసం చేసినందున తగిన చర్యలు తీసుకోవాల­న్నా­రు. వాద–ప్రతివా­దన­లను ఆలకించిన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.నాగప్రసన్న విచారణను సెప్టెంబర్ 27కు వాయిదా వేశారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement