శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: శు.నవమి సా.6.10 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: మూల సా.6.01 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: సా.4.24 నుండి 6.00 వరకు, తదుపరి తె.3.39 నుండి 5.15 వరకు (తెల్లవారితే శుక్రవారం), దుర్ముహూర్తం: ఉ.9.55 నుండి 10.43 వరకు, తదుపరి ప.2.49 నుండి 3.37 వరకు, అమృతఘడియలు: ఉ.11.22 నుండి 1.01 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 5.50, సూర్యాస్తమయం: 6.04.
మేషం.... పనుల్లో ఆటంకాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
వృషభం.... శ్రమాధిక్యం. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యయప్రయాసలు. బం«ధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
మిథునం... పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
కర్కాటకం... దీర్ఘకాలిక సమస్య పరిష్కారం. శుభకార్యాలపై చర్చలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
సింహం.... కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. పనుల్లో అవాంతరాలు. ధనవ్యయం ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా కొనసాగుతాయి.
కన్య... సన్నిహితులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. పనుల్లో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
తుల... పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
వృశ్చికం... మిత్రులు, బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.
ధనుస్సు... శుభవర్తమానాలు అందుతాయి. వ్యవహారాలలో అనుకూలత. పనులు చకచకా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
మకరం..... పనులు నిదానిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా ఉంటాయి.
కుంభం... కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు, ఉద్యోగాలు చిక్కులు తొలగుతాయి.
మీనం... కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో వివాదాలు తీరతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment