న్యూఢిల్లీ: కరోనా రోగి నుంచి వైరస్ ఎంత మందికి వేగంగా వ్యాపిస్తుందని తెలిపే ఆర్–వాల్యూ దేశంలో 2.2 కు దిగివచ్చింది. జనవరి 7–13 తేదీల గణాంకాలను విశ్లేషించి ఈ అంచనాకు వచ్చినట్లు ఐఐటీ మద్రాస్ గణిత విభాగం, కంప్యూటేషన్ మ్యాథమేటిక్స్, డాటా సైన్స్ సెంటర్ ప్రొఫెసర్ నీలేశ్ చెప్పారు. ఆర్–వ్యాల్యూ 1 లోపు ఉంటే కరోనా వైరస్ వ్యాప్తి అదుపులో ఉన్నట్లు భావిస్తారు. జనవరి 1–6 తేదీల్లో ఆర్–వాల్యూ ఏకంగా 4కు ఎగబాకి దేశ వైద్యరంగాన్ని ఆందోళనలోకి నెట్టేసింది. దేశంలో కొత్తగా గత 24 గంటల్లో మరో 2,71,202 కరోనా కేసులు వచ్చాయి.
(చదవండి: ఏమా అదృష్టం.. పెయింటర్‌ను వరించిన రూ.12 కోట్ల లాటరీ.. టికెట్ కొన్న గంటల్లోనే)
Comments
Please login to add a commentAdd a comment