ఆరు నెలల్లో అర్హులందరికీ సంక్షేమ పథకాలు | PM Modi Launches Viksit Bharat Sankalp Yatra to Expedite Welfare Scheme Saturation | Sakshi
Sakshi News home page

ఆరు నెలల్లో అర్హులందరికీ సంక్షేమ పథకాలు

Published Sun, Oct 22 2023 6:18 AM | Last Updated on Sun, Oct 22 2023 6:18 AM

PM Modi Launches Viksit Bharat Sankalp Yatra to Expedite Welfare Scheme Saturation - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ పూర్తి స్థాయిలో వేగంగా అందించేందుకు ప్రధాని మోదీ ఆరు నెలలు గడువు విధించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర’ పేరుతో మెగా డ్రైవ్‌ చేపట్టనుంది.

ఇందులో భాగంగా ప్రత్యేకంగా రూపకల్పన చేసిన ‘రథా’ల్లో దేశంలోని మొత్తం 2.7 లక్షల పంచాయతీల్లోని అర్హులైన లబ్ధిదారులను కలుసుకుని, వారి పేర్లను నమోదు చేయనుంది. ఈ బృహత్తర కార్యక్రమం వచ్చే నెలలో దీపావళి తర్వాత ప్రారంభమై కొన్ని వారాలపాటు కొనసాగుతుందని శనివారం అధికారవర్గాలు తెలిపాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement