ప్రధాని నరేంద్ర మోదీ రాజస్తాన్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజస్తాన్ కాంగ్రెస్‌లోని అంతర్గత విభేదాలను ఉద్దేశిస్తూ మోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. సొంత పార్టీలోని ఎమ్మెల్యేల తోసహ ముఖ్యమంత్రిని కూడా నమ్మరంటూ ఎద్దేవా చేశారు మోదీ. ఇలా ఒకరిపై ఒకరు మాటలు దాడి చేసుకుంటూ కూర్చుంటే రాష్ట్ర అభివృద్ధిని ఎవరూ పట్టించుకుంటారని నిలదీశారు.
ప్రస్తుతం రాజస్తాన్ కాంగ్రెస్‌లో సీఎం ఆశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌ల మధ్య పెద్ద వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు మోదీ రాజస్తాన్‌లోని రాజ్‌సమంద్‌లో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమంలో అభివృద్ధి ప్రాజెక్టుల శ్రేణిని ఆవిష్కిరిస్తూ..కొంతమంది ప్రజలు తమ ప్రభుత్వం పట్ల ప్రతికూలతతో ఉన్నారు. ఈ రోజు దాదాపు రూ. 5,500 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించాం.
మా ప్రభుత్వం రాజస్తాన్‌లో ఆధునికి మౌలిక సదుపాయాలను కల్పించడంపై దృష్టిసారిస్తోంది. అసలు రాజస్తాన్‌లో ముందే సరిపడా మెడికల్ కాలేజీలు నిర్మించి ఉంటే వైద్యులు కొరత ఎదుర్కొవాల్సి అవసరం ఉండేది కాదు. అలాగే ప్రతి ఇంటికి నీరు ఇచ్చి ఉంటే రూ. 3.5 లక్షల కోట్ల జల్‌జీవన్ మిషన్ ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడేది కాదు. కొంతమంది దూదృష్టితో కూడిన దృక్పథంతో తమ రాజకీయ ప్రయోజనాలకు మించి ఆలోచించలేరంటూ కాంగ్రెస్‌ని ఉద్దేశిస్తూ.. పరోక్షంగా గట్టి కౌంటరిచ్చారు.
మోదీ కాంగ్రెస్‌లోని విభేదాలను ఆసరాగా తీసుకుని తమ ప్రభుత్వమే రాజస్థాన్ అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా ఆ కార్యక్రమంలో ఆశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ..మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌ని రాజస్తాన్ అధిగమించిందన్నారు. తమ రాష్ట్రానికి జాతీయ రహదారి, రైల్వే ప్రాజెక్టులను అందించినందుకు ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం రాజస్తాన్‌లో రహదారులు బాగున్నాయని చెప్పారు గెహ్లాట్. కాగా, డిసెంబర్‌లో రాజస్తాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా, ఇలా మోదీ రాజస్తాన్‌లో పర్యటించడం ఈ ఏడాదిలో మూడోసారి.
(చదవండి: దంపతులు మధ్య చిచ్చు రేపిన ట్రాఫిక్ కెమెరా పిక్స్..జైలుపాలైన భర్త)
Comments
Please login to add a commentAdd a comment