టాలెంట్ ఎవడి సొత్తు కాదు. అది ఉన్నోడు ఎలాగైనా వెలుగులోకి వస్తాడు. ఒకప్పుడు తమ టాలెంట్‌ని నిరూపించుకోవడానికి అవకాశాలు రాక నానా ఇబ్బందులు పడేవారు. కానీ నేటి కంప్యూటర్ యుగంలో మాత్రం తమ టాలెంట్‌ని నిరూపించుకోవడానికి ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఒక ఫోన్ ఉంటే చాలు. ప్రపంచం మొత్తానికి మన టాలెంట్‌ని చూపించుకోవచ్చు. సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది రాత్రికి రాత్రే స్టార్లైపోతున్నారు. లైకులు, షేర్లు, కామెంట్లు పెట్టి టాలెంట్‌ని ఉన్నవారిని ఎంకరేజ్ చేయడంతో పాటు సెలబ్రిటీని చేస్తున్నారు నెటిజన్లు. తాజాగా ఓ ఆటో డ్రైవర్ కూడా ఒకే ఒక్క వీడియోతో ఫేమస్ అయిపోవడమే కాకుండా.. ఏకంగా సినిమా చాన్స్‌ని కొట్టేశాడు.
వివరాల్లోకి వెళితే..మహారాష్ట్ర, పుణె సిటీకి దగ్గరలోని బారామతి తాలుకాకు చెందిన బాబాజి కాంబ్లే అనే ఆటోడ్రైవర్ చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ప్రాణం. తన నటనని వెండితెరపై ప్రదర్శించి ప్రేక్షకులను రంజింపజేయాలనుకున్నాడు. కానీ అవకాశాలు రాకపోవడంతో ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అప్పుడప్పుడు తనలోని టాలెంట్‌ని తోటి డ్రైవర్ల దగ్గర ప్రదర్శించి, వారిని అలరించేవాడు.
అలా ఒక రోజు ఆటో స్టాండ్ లో తనదైన స్టైల్లో స్టెప్పులేసి అదరగొట్టాడు. ‘మల జావు ధ్యానా ఘరి’ అనే పాటకు మహారాష్ట్ర పాపులర్ డ్యాన్స్ ‘లవని’ స్టైల్‌లో పర్ఫార్మ్ చేసి ఫిదా చేశాడు. ఆ పాటకు అచ్చం సినిమా హీరోలా చేసిన ఆయన డ్యాన్స్ వీడియోను అతడి స్నేహితులు సోషల్ మీడియాలో షేర్ చేయగా, నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీంతో వారు బాబాజి కాంబ్లేపై ప్రశంసల జల్లు కురిపించడంతో పాటు ఆ వీడియోని వైరల్ చేశారు.
ఆ ఒక్క వీడియోతో కాంబ్లే సెలబ్రిటీ అయిపోయాడు. ఈ వీడియోను మహారాష్ట్ర ఇన్ఫర్మేషన్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ దయానంద్ తన ట్వీటర్‌లో షేర్ చేశాడు. ఈ ట్రెండింగ్ వీడియో చూసిన మరాఠి ఫిల్మ్ డైరెక్టర్ ఘన్‌శ్యామ్ విష్ణుపంత్ యేడే తన సినిమాలో నటించాలని కాంబ్లేకు ఆఫర్ ఇచ్చాడు. కాంబ్లేకు సినిమాలో ఆఫర్ లభించడంతో తోటి ఆటో డ్రైవర్ కాంబ్లే తెగ సంబరపడిపోతున్నారు.
చదవండి:
బట్టలు జారిపోతున్నా పట్టించుకోని లేడిదొంగ!
స్మార్ట్ వాచ్.. బాయ్‌ఫ్రెండ్‌ను పట్టిచ్చింది!
Comments
Please login to add a commentAdd a comment