హోం.. స్వీట్ హోం.. ఎవరికైనా ఇళ్లంటే ఇష్టమే. పందిరి ఇంటి నుంచి పదంస్తుల మేడ వరకు ఏదైనా సరే ఒక ఇళ్లు కలిగి ఉండాలని అంతా కోరకుంటాం. పక్షులు కూడా అంతే గుడ్లు పెట్టే సమయంలో కచ్చితంగా గూడు కట్టుకుంటాయి. అందుకోసం ఎంతగానో శ్రమిస్తాయి. చెట్లు, మొక్కల నుంచి రకరకాల పదార్థాలు సేకరించి... వాటిని అల్లి చిత్రవిచ్రితంగా గూళ్లు కడుతుంటాయి.
అయితే ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంతనంద ట్విట్టర్‌లో షేర్ చేసిన పోస్టులో ఉన్న లవ్‌బర్డ్ చాలా స్మార్ట్. ఎంతో నేర్పుగా ఆకులోని మధ్య ఈనెను తొలచి వేస్తుంది. అలా తొగించిన వాటిని ఈకల్లో దాచిపెట్టుకుంటోంది. మాములుగా అయితే నోటితో పట్టుకుని.. గూడు నిర్మించే చోటుకి వాటిని తరలించాలి. ఒక్కోసారి ఒక్కోటి పట్టుకుని వెళితే సమయం, శ్రమ ఎక్కువ అవుతుందని ఆలోచించిన లవ్‌బర్డ్ ఈనెలను ఈకల్లో దాచుకోవడమే ఇక్క ‘స్మార్ట్’. ఇక లవ్‌బర్డ్ తెలివైన పనిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంతనంద దానిని షేర్ చేయగా వైరల్ అయింది. ఈ వీడియో చూసిన వారు పక్షి తెలివి తేటలకి తెగ ముచ్చటపడుతున్నారు.
Just amazing...
— Susanta Nanda IFS (@susantananda3) June 22, 2021
Love bird rips the mid vein of leaves, tucks it in the feather & flies to build its nest when it has enough. Not flying each time. Efficiency👌
From Channa Prakash pic.twitter.com/ddJaEuFJ39
చదవండి : కార్బెట్ రిజర్వ్‌లో తెల్ల నెమలి.. 85 ఏళ్లలో ఇదే తొలిసారి
Comments
Please login to add a commentAdd a comment