లక్ష్మణచాంద: మండలంలోని కనకాపూర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం కనకాపూర్ గ్రామానికి చెందిన ముత్యాల అరుణ్ పరిమండల్ రోడ్డు వైపు ఉన్న ఫంక్షన్ హాల్ వైపు నుండి బైక్‌పై గ్రామానికి వస్తుండగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లికి చెందిన దోష గంగాధర్ కారులో వస్తూ బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో అరుణ్‌కు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆటోలో నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గంగాధర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుమలత తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment