వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

Published Sat, Oct 19 2024 1:24 AM | Last Updated on Sat, Oct 19 2024 1:24 AM

వాతావరణం

ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. తుపాను ప్రభావంతో అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉంది.
గ్రూప్‌–2, 3 పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: గ్రూప్‌–2, 3 పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లను పూర్తిచేయాలని టీజీపీఎస్సీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ టీజీపీఎస్సీ ప్రధాన కార్యాలయం నుంచి అన్ని జిల్లాల అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గ్రూప్‌–2, 3 పరీక్షలు అత్యంత పకడ్బందీగా నిర్వహించాలన్నారు. నవంబర్‌ 17, 18 తేదీల్లో గ్రూప్‌– 3, డిసెంబర్‌ 15, 16 తేదీల్లో గ్రూప్‌– 2 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షకు సంబంధించి జిల్లా నోడల్‌ అధికారిగా అదనపు కలెక్టర్‌ వ్యవహరిస్తారన్నారు. అన్ని జిల్లాల్లో స్ట్రాంగ్‌రూంలను గుర్తించాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో సరిపడా ఫర్నిచర్‌, విద్యుత్‌, ఇతర సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు. టీజీపీఎస్సీ నిబంధనలకు లోబడి పరీక్ష కేంద్రాలను కేటాయించాలన్నారు. పరీక్ష నిర్వహణకు సరిపడా సిబ్బందిని సమకూర్చుకోవాలని ఆదేశించారు. అధికారులు పరీక్ష కేంద్రాలను సందర్శించి సౌకర్యాలు పరిశీలించిన తర్వాతనే అనుమతులు ఇవ్వాలని తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్‌ ఫైజాన్‌అహ్మద్‌ మాట్లాడుతూ గ్రూప్‌–2, 3 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పకడ్బందీగా పరీక్ష కేంద్రాలను ఎంపిక చేయాలన్నారు. ఈ సమావేశంలో ప్రాంతీయ సమన్వయకర్త గంగారెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement