నిర్మల్‌చైన్‌గేట్: అంగన్‌వాడీ టీచర్స్‌పై అధికారుల బెదిరింపులు ఆపాలని అంగన్‌వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.లలిత కోరారు. సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనబోమని అంగన్‌వాడీ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కమిషనర్‌కు శనివారం వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలోనే సమగ్ర కుటుంబ సర్వే చేయమని గత కమిషనర్‌తోపాటు సీడీపీవోకు వినతిపత్రాలు ఇచ్చామన్నారు. అయినా ఎంపీడీవోలు పంచాయతీ అధికారులు సర్వేలో పాల్గొనాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఇకనైనా అంగన్‌వాడీలపై అధికారుల వేధింపులు ఆపకపోతే పోరాటం ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు శైలజ, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు పోశెట్టి, భాగ్య, హేమలత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment