ప్రశాంతంగా గ్రూప్–3 పరీక్షలు
నిర్మల్ రూరల్: జిల్లాలో ఆదివారం జరిగిన గ్రూప్–3 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉద యం 10నుంచి మధ్యాహ్నం 12.30గంటల వర కు పేపర్–1 పరీక్ష, మధ్యాహ్నం 3నుంచి 5.30 గంటల వరకు పేపర్–2 పరీక్ష నిర్వహించారు. నిమిషం నిబంధన, బయోమెట్రిక్ అమలు చేసి గంట ముందుగానే అభ్యర్థులను పరీక్షాకేంద్రాల్లోకి అనుమతించారు. జిల్లాలో 24 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్–1 పరీక్షకు 8,124కి 4,710 (57.98%) మంది అభ్యర్థులు హాజరు కాగా, 3,414 మంది గైర్హాజరయ్యారు. పేపర్–2కు 8,124 మందికి 4,690 (57.73%) మంది అభ్యర్థులు హాజరు కాగా, 3,434 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. కలెక్టర్ అభిలాష అభినవ్ సెయింట్ థామస్, చాణక్య పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షాకేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ జిల్లా కేంద్రంలోని వాసవి, రవి, విన్నర్స్ హైస్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షాకేంద్రాలను పరిశీలించారు. సోమవారం పేపర్–3 పరీక్ష ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు నిర్వహించనున్నారు.
కేంద్రాల వద్ద పకడ్బందీ బందోబస్తు
నిర్మల్‌టౌన్: గ్రూప్–3 పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పరీక్షాకేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాల మేరకు పరీక్షాకేంద్రాల వద్ద 163, 144 సెక్షన్లు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రాలకు చేరుకునే సమయంలో అభ్యర్థులకు ఏవైనా ఇబ్బందులుంటే ఆయా పరిధిలోని పోలీస్ అధికారులను లేదా ‘డయల్ 100’ ను సంప్రదించాలని సూచించారు. ఎస్పీ వెంట పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్, సోన్ సీఐ నవీన్‌కుమార్, సిబ్బంది ఉన్నారు.
కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ
పేపర్–1కు 57.98% మంది అభ్యర్థులు
పేపర్–2కు 57.73% మంది హాజరు
కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment