● జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో వైన్స్, కల్లు దుకాణాలు బంద్ ● ఐదు రోజులు నిలిచిపోనున్న అమ్మకాలు
భైంసాటౌన్: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాల్లో అమ్మకాలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు మహారాష్ట్రకు సరిహద్దున 5 కి.మీ.ల పరిధిలో తెలంగాణలో ఉన్న వైన్స్, బార్లు, కల్లు దుకాణాలు మూసి ఉంచాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు జారీ చేసినట్లు భైంసా ఎకై ్సజ్ సీఐ నజీర్‌హుస్సేన్ సోమవారం తెలిపారు. మహారాష్ట్రలో ఈనెల 20న పోలింగ్ ఉండగా, 23న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈ కారణంగా ఈనెల 18 సాయంత్రం 6 నుంచి కౌంటింగ్ ముగిసేవరకు దుకాణాలు మూసి ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు వెల్లడించారు. దీంతో భైంసా ఎకై ్సజ్ శాఖ పరిధిలోని కుభీర్, తానూర్, బాసర మండలాల్లోని 22 ఆయా గ్రామాల్లో కల్లు దుకాణాలు, బాసరలో ఓ వైన్స్‌లో ఐదురోజులపాటు మద్యం, కల్లు అమ్మకాలు నిలిచిపోనున్నాయి.
5 కి.మీ. పరిఽధిలోని గ్రామాలివే..
కుభీర్ మండలం హల్దా, రంగశివిని, పార్డి(బి), మార్లగొండ, బెల్గాం, పల్సి, సిర్పెల్లి, నిగ్వ, సావ్లి(1,2) మహాలింగి, బామ్ని, తానూర్ మండలంలోని బెల్‌తరోడ, బోరిగాం, మొగిలి, తొండాల, దౌల్తాబాద్, జౌల(కె), జౌల(బి), ఎల్వత్, బాసర మండలంలోని బద్రెల్లి, లాబ్ధి గ్రామాల్లోని కల్లు దుకాణాలతోపాటు బాసరలోని వైన్స్ మూసి ఉండనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment