సమయపాలన పాటించాలి | - | Sakshi
Sakshi News home page

సమయపాలన పాటించాలి

Published Wed, Nov 20 2024 12:09 AM | Last Updated on Wed, Nov 20 2024 12:09 AM

-

పెంబి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్‌వో రాజేందర్‌ సూచించారు. పెంబి పీహెచ్‌సీని మంగళవారం సందర్శించారు. యాంటీబయోటిక్‌ మందులు అవసరం మేరకే ఉపయోగించాలని సూచించారు. అతిగా వాడితే రెసిస్టెన్స్‌ పవర్‌ తగ్గిపోయి ఇన్‌ఫెక్షన్లు చుట్టుముడతాయని తెలిపారు. ఈమేరకు రోగులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ మీడియా, విస్తరణ అధికారి రవీందర్‌, డీపీహెచ్‌ఎన్‌వో సాయమ్మ, వైద్యాధికారి శివకుమార్‌, శాంతన్‌రెడ్డి, ఫార్మసిస్టు శ్రీనివాస్‌, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో రాజేందర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement