నిర్మల్: కాలేజీలో చేరేందుకు ఆసక్తి గల విద్యార్థులు ఉన్నా.. జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీ పీజీ కాలేజీని కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారని జ్ఞానసరస్వతీ యూనివర్సిటీ సాధన సమితి అధ్యక్షుడు నంగె శ్రీనివాస్ ఆరోపించారు. ఈ మేరకు మెయిల్ ద్వారా యూనివర్సిటీల చాన్స్‌లరైన గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు ఫిర్యాదు చేశారు. జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల విద్యార్థులు పోస్టు గ్రాడ్యుయేషన్ చదివేందుకు ఉపయోగపడాల్సిన కాలేజీ భవనాన్ని నర్సింగ్ కళాశాలకు కేటాయించడం దారుణమన్నారు. జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాల్సిన అధికారులే ఇలా తప్పుదోవ పట్టించడం సరికాదని, పీజీ కాలేజీని పునరుద్ధరించాలని ఫిర్యాదులో కోరినట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment