‘సమగ్ర’ ఉద్యోగుల సమ్మెబాట | - | Sakshi
Sakshi News home page

‘సమగ్ర’ ఉద్యోగుల సమ్మెబాట

Published Tue, Dec 10 2024 12:28 AM | Last Updated on Tue, Dec 10 2024 12:28 AM

‘సమగ్ర’ ఉద్యోగుల సమ్మెబాట

‘సమగ్ర’ ఉద్యోగుల సమ్మెబాట

● మూడు రోజులపాటు రిలే దీక్షలు ● ప్రభుత్వం నుంచి స్పందన కరువు ● నేటి నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధం

మంచిర్యాలఅర్బన్‌/కెరమెరి(ఆసిఫాబాద్‌): విద్యాశాఖలో కీలకంగా వ్యవహరిస్తున్న సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెకు సిద్ధమయ్యారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన బాటపట్టారు. ఈ నెల 6 నుంచి జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్‌ ఎదుట రిలే దీక్షలు చేపట్టినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో మంగళవారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నారు. ఎమ్మార్సీ, సీఆర్‌సీ స్థాయిల్లో పనులకు అటంకం ఏర్పడనుంది. అలాగే కేజీబీవీలు, యూఆర్‌ఎస్‌ల ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొననున్నారు.

క్రమబద్ధీకరణ కోసం..

సమగ్ర శిక్షా పరిధిలో క్లస్టర్‌ స్థాయి, జిల్లా స్థాయితో పాటు కేజీబీవీ, యూఆర్‌ఎస్‌లో రాష్ట్రవ్యాప్తంగా 19వేల మంది కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా 2017 మంది సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. పదేళ్లకు పైగా పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేక ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని, అప్పటివరకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. వివిధస్థాయిల్లో వినతులు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడంతో రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈ నెల 6 నుంచి మూడు రోజులపాటు రిలే దీక్షలు చేపట్టారు.

సేవలకు ఆటంకం

సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం నుంచి సమ్మె చేపడుతుండటంతో విద్యాశాఖలో పలు సేవలు నిలిచిపోనున్నాయి. డీపీవో స్టాఫ్‌, అకౌంటెంట్స్‌, ఏఎన్‌ఎం, సీఆర్‌టీ, పీజీ సీఆర్‌టీ, స్పెషల్‌ ఆఫీసర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఐఈఆర్‌పీ, ఎంఐఎస్‌సీసీవో, పార్ట్‌టైం టీచర్లుగా వీరు విధులు నిర్వహిస్తున్నారు. కేజీబీవీ, యూఆర్‌ఎస్‌, భవిత కేంద్రాల్లో బోధన నిలిచి విద్యార్థుల చదువుపై ప్రభావం పడనుంది. డీఈవో, ఎంఈవో కార్యాలయాలు, వృత్తి విద్యా ఇన్‌స్ట్రక్టర్లు విధులకు దూరంగా ఉండనుండటంతో ఆన్‌లైన్‌ పనులు నిలిచిపోనున్నాయి. ఉమ్మడి జిల్లాలోని వివిధ మండలాల్లో సమగ్ర శిక్షా ఉద్యోగులు ఎంఈవోలు, కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులకు ఇప్పటికే సమ్మె నోటీసులు అందించారు.

ఉద్యోగుల వివరాలు

జిల్లా ఉద్యోగులు

ఆదిలాబాద్‌ 607

మంచిర్యాల 513

కుమురంభీం 473

నిర్మల్‌ 424

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement