బోథ్ మండలంలో సంచారం?
బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం ధన్నూర్ బి, నాగాపూర్ గ్రామాల మధ్య పులి సంచరిస్తున్నట్లు ధన్నూర్ బి గ్రామానికి చెందిన పలువురు పేర్కొన్నారు. ఓ చేనులో కుక్కపై దాడి చేసి లాక్కెళ్లినట్లు ఓ రైతు తెలిపాడు. ఈ మేరకు గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో మైక్‌లో అప్రమత్తం చేశారు. కాగా, మంగళవారం రాత్రి అటవీ అధికారులు చేనులో పులి అడుగుల కోసం పరిశీలించారు. చిరుత సంచరించి ఉండొచ్చని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.
దూడపై దాడి..
ఆపై పట్టాలు దాటి
సిర్పూర్(టి): సిర్పూర్(టి) రేంజ్ పరిధిలో పెద్దపులి మంగళవారం హడలెత్తించింది. సిర్పూర్(టి) మండలం హుడికిలి గ్రామానికి చెందిన దంద్రే రావుజీ ఇంటి వద్ద కట్టేసి ఉన్న గేదె దూడపై వేకువజామున దాడి చేసి చంపింది. గ్రామంలోకి పెద్దపులి రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులు ఘటనాస్థలిని పరిశీలించి పాదముద్రలు గుర్తించారు. భయంతో ప్రజలెవరూ ఇళ్లు వదిలి బయటకు రాలేదు. అనంతరం సిర్పూర్(టి)– మాకోడి రైలు పట్టాలు దాటుతుండగా పెద్దపులి కెమెరాకు చిక్కింది. సరిహద్దు ప్రాంతంలోని మహారాష్ట్రలోని మాకోడి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాలు దాటి అడవుల్లోకి వెళ్లింది. గమనించిన రైల్వే ఉద్యోగులు వీడియో తీశారు.
పట్టాలు దాటుతున్న పెద్ద పులి
Comments
Please login to add a commentAdd a comment