వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. చలి తీవ్రత పెరుగుతుంది. రాత్రి నుంచి ఉదయం వరకు పొగమంచు కురుస్తుంది.
వణుకుతున్న పల్లెలు
మామడ: మండలంలో చలి పెరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బ యటకు వచ్చేందుకు జంకుతున్నారు. సోమవారం రాత్రి 8గంటలకు ‘సాక్షి’ బృందం మండలంలోని గుట్టల మీది గిరిజన గ్రామాలైన రచ్చకోట, గోండుగూడ, తోటిగూడ గ్రామాలను సందర్శించింది. చలి, ఈదురుగాలులతో వ్యవసాయ పనులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సాయంత్రం 6గంటల వరకు ఇళ్లకు చేరుకుంటున్నారు. ఉద యం 8గంటల వరకు కూడా ఇళ్ల నుంచి బ యటకు రాని పరిస్థితి నెలకొంది. గిరిజనులు రాత్రి వేళ చలి నుంచి రక్షణకు ఇళ్ల వద్ద మంటలు వేస్తూ చలికాగుతున్నారు.
కమ్ముకున్న పొగమంచు
మండలంలోని గుట్టల మీది గ్రామాల్లో ఉ దయం పొగమంచు కమ్ముకుంది. ఉదయం 9 గంటల వరకు కూడా ప్రజలు ఇళ్ల నుంచి రాలేదు. పొగమంచు కారణంగా జాతీయ రహదారిపై ఎదురుగా వచ్చే వాహనాలు దగ్గరకు వచ్చే వరకు కనిపించపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
రోజువారీ పనులు
చేసుకోలేకపోతున్నం
ఈ ఏడాది చలి ఎక్కువగా ఉంది. రోజువారీ పనులు సకాలంలో చేసుకోలేక పోతున్నం. రాత్రిపూట ఇంటి వద్ద మంట వేసుకుని ఉపశమనం పొందుతున్నం. చలి కారణంగా ఉదయం 8గంటల వరకు బయటకు వస్తలేము.
– సక్కుబాయి, గోండుగూడ
Comments
Please login to add a commentAdd a comment