‘డబుల్’ నిర్మాణాలపై నివేదిక ఇవ్వాలి
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలపై తహసీల్దార్లు, సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో ఆమె సమావేశమై మాట్లాడారు. జిల్లాకు మంజూరైన డబుల్ బెడ్రూం ఇళ్లు, పరిపాలన అనుమతులు పొందినవి, పూర్తయినవి, నిర్మాణ దశలో ఉన్న వాటిపై సమగ్ర నివేదికలు అందించాలని సూచించారు. ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన డబుల్ బెడ్రూం ఇళ్లలో విద్యుత్, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్నకళ్యాణి, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment