కొనసాగిన సీఎం కప్ పోటీలు
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో రెండోరోజూ జిల్లాస్థాయి సీఎం కప్ పోటీలు కొనసాగాయి. మంగళవారం బాక్సింగ్, హ్యాండ్‌బాల్, నెట్‌బాల్, చెస్, తైక్వాండో, కరాటే పోటీలు నిర్వహించారు. జిల్లాలోని 18 మండలాల నుంచి 800 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీలో నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీలను అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ప్రా రంభించారు. ఇందులో 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మా ట్లాడుతూ.. గ్రామీణ స్థాయి క్రీడాకారులను గుర్తించడమే సీఎం కప్ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్‌రెడ్డి, జి ల్లా ఒలింపిక్ అసోసియేషన్ కన్వీనర్ శ్రీధర్‌రెడ్డి, ఎస్జీఎఫ్ సెక్రటరీ రవీందర్‌గౌడ్, వ్యాయామ ఉపాధ్యాయులు భోజన్న, భూమన్న, బుచ్చి రామారా వు, రమణారావు, స్వామి, భూమేశ్, జమున, విజ యలక్ష్మి, రాజేందర్, కవిత, సంజీవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment