రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
సారంగపూర్: సీఎం కప్ ఆటల పోటీల్లో మండలంలోని జామ్ గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యార్థినులు సత్తా చాటారు. బేస్‌బాల్ పోటీల్లో గాయిత్రి, మౌనిక, మమత, సాయికీర్తి, సాఫ్ట్‌బాల్ పోటీల్లో గాయిత్రి, గౌతమి ఉత్తమ ఆటతీరు కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిని ప్రిన్సిపాల్ సంగీత, పీఈటీ, పీడీలు అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఉత్తమ ఆటతీరు ప్రదర్శించి పాఠశాలకు పేరు తేవాలని విద్యార్థినులకు వారు సూచించారు.
కుభీర్: మండలానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు సీఎం కప్ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు కుభీర్ ఉన్నత పాఠశాల పీడీ క్రాంతి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో బాక్సింగ్‌లో శ్రీకాంత్, పవర్‌లిఫ్టింగ్‌లో ఎండీ జావెద్ మొదటి స్థానాల్లో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. వీరిని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎస్వో శ్రీకాంత్‌రెడ్డి, సీజీఎఫ్ సెక్రటరీ రవీందర్‌గౌడ్, ఖోఖో సెక్రటరీ శ్రీధర్‌రెడ్డి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment