పెన్షనర్ల హక్కులను పరిరక్షిస్తాం
నిర్మల్‌చైన్‌గేట్: పెన్షనర్ల హక్కులను పరిరక్షిస్తామని కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ ప్రభుత్వ రిటై ర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో నిర్వహించిన జాతీ య పెన్షనర్ల దినోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ కార్మికులు, విశ్రాంత ఉద్యోగులను కలెక్టర్, అధికారులు శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సీనియర్ సిటిజన్ యాక్ట్ ద్వారా హక్కులు, రక్షణ పొందవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా పెన్షనర్ల సంఘ భవనం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి రూ.5 లక్షలు కలెక్టర్ మంజూరు చేసినట్లు పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంసీ లింగన్న తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక, డీటీవో సరోజ, ఆర్డీవో రత్నకళ్యాణి, ఎస్టీవో రమేశ్, తహసీల్దార్ రాజు, సంఘం ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment