జామ్ గురుకులం ఆకస్మిక తనిఖీ
సారంగపూర్: పీఎం శ్రీకింద ఎంపికై న మండలంలోని జామ్ సాంఘిక సంక్షేమశాఖ బాలికల గురుకుల విద్యాలయాన్ని గురువారం రాత్రి కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ ప్రకారం భో జనం అందుతుందా? అని విద్యార్థులను అడిగి తె లుసుకున్నారు. అనంతరం పదోతరగతి రివిజన్ త రగతులకు వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. భోజనశాలను పరిశీలించి ప్రిన్సిపాల్ సంగీ త, తహసీల్దార్ శ్రీదేవిని పిలిచి రెండురోజుల్లో రంగులు వేయాలని, కాంట్రాక్టర్‌ను పిలిపించి పెండింగ్ పనులు పూర్తి చేయించాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులు బసచేసే గదుల్లో సౌకర్యాలు, మ రుగుదొడ్లు, మూత్రఽశాలలు పరిశీలించారు. డీఈవో రామారావు, ఎంఈవో మధుసూదన్, ఎంపీవో అజీ జ్‌ఖాన్, ఎంఆర్‌ఐ నర్సయ్య తదితరులున్నారు.
విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించిన కలెక్టర్ అభిలాష అభినవ్
పెండింగ్ పనులు పూర్తిచేయాలని ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment