![’వై’ జంక్షన్ సమస్య పరిష్కరించాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06nrl276-340134_mr-1738868841-0.jpg.webp?itok=tbzQAFmF)
’వై’ జంక్షన్ సమస్య పరిష్కరించాలి
నిర్మల్‌చైన్‌గేట్: సోన్ మండలం కడ్తాల్ సమీపంలోని జాతీయ రహదారి ‘వై’ జంక్షన్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కడ్తాల్ గ్రామస్తుల ఇబ్బందులపై గురువారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులు, గ్రామస్తులతో సమావేశమయ్యారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జాతీయ రహదారి ఇంజినీరింగ్ అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులందరితో ఇప్పటికే సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఆర్డీవో అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయగా, ఇప్పటికే రహదారిని పరిశీలించినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరా లతో ప్రాజెక్ట్ రిపోర్టు సిద్ధం చేయాలని సూచించా రు. కడ్తాల్ నుంచి నిర్మల్ వైపు వాహనాలు మళ్లే దారిలో తాత్కాలిక రహదారి విభాగినులను ఏర్పా టు చేసి భారీ వాహనాలు మళ్లుతాయో లేదో తెలుసుకునేందుకు ఆర్టీసీ బస్సులు తిప్పి చూడాల ని పేర్కొన్నారు. అనంతరం గ్రామస్తుల సూచనలు స్వీకరించారు. ఎస్పీ జానకీ షర్మిల, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్, అదనపు ఎస్పీలు రాజేశ్‌మీనా, ఉపేంద్రారెడ్డి, ఆర్డీవో రత్నకళ్యాణి, ఆర్‌అండ్‌బీ ఈఈ అశోక్‌కుమార్, జాతీయ రహదారుల అధికారి ప్రసన్న, ఆర్టీవో దుర్గప్రసాద్, సోన్ తహసీల్దార్ మల్లేశ్, ఎంపీడీవో సురేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment