జోరుగా ఇసుక దందా
● రాత్రీపగలు అక్రమంగా తరలింపు ● చోద్యం చూస్తున్న అధికారులు
తానూరు: మైనింగ్, రెవెన్యూశాఖల అధికారుల కళ్లు గప్పిన అక్రమార్కులు అనుమతి లేకుండా ఇసుకను టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్, మహారాష్ట్రలోని ధర్మాబాద్, కారేగాం గోదావరి నుంచి యథేచ్ఛగా ఇసుకను ముథోల్ నియోజకవర్గంలోని ఆయా మండలాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు, మైనింగ్, రెవెన్యూ అధికారుల నిఘా కొరవడటంతో అక్రమ దందా జోరుగా సాగుతోంది. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
పక్షం రోజులుగా..
పక్షం రోజులుగా నిజామాబాద్ జిల్లాలోని బోధన్, మహారాష్ట్రలోని ధర్మాబాద్, కారేగాం గోదావరి నది నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. తానూరు మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో అవసరమున్న వారికి విక్రయిస్తూ అక్రమంగా అర్జిస్తున్నారు. ప్రభు త్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఈ దందా అధికారులకు తెలిసే జరుగుతోందనే ఆరోపణలు న్నాయి. సరిహద్దులోని తానూరు, ముథోల్ మండలాల్లో అక్రమార్కులు ఇసుకను డంపు చేసి దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొంత మంది గ్రా మాల్లో రాత్రి వేళ డంపు చేసిన ఇసుకను మరుసటిరోజు ఆర్డరు తీసుకున్న ప్రాంతాలకు తరలిస్తున్నా రు. అక్రమార్కులు తమ దందాను మూడు టిప్ప ర్లు, ఆరు ట్రాక్టర్లుగా నడిపిస్తున్నారు. కొందరు ఏ జెంట్లుగా మారి ఇక్కడి అధికారులతో బేరం కుదుర్చుకుని రాత్రి ఇసుక కుప్పలను నిల్వ చేసి అవసరమున్నవారికి అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు పోలీసులు నామమాత్రంగా పట్టుకుని రెవెన్యూ అధికారులకు అప్పగిస్తున్నారు. అయినా ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు.
పోలీసుల తనిఖీల్లో..
● ఇటీవల మహారాష్ట్రలోని ధర్మాబాద్ నుంచి తానూరుకు ఇసుక లోడ్‌తో వస్తున్న టిప్పర్‌ను ముధోల్ సీఐ మల్లేశ్ ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకుని రెవెన్యూ శాఖకు అప్పగించారు.
● ఆరు నెలల క్రితం భైంసా నుంచి మహాలింగి గ్రామానికి అనుమతి లేకండా ట్రాక్టర్‌లో ఇసుకను మహాలింగి గ్రామానికి తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని రెవెన్యూ శాఖకు అప్పగించారు.
చర్యలు తీసుకుంటాం
ఇసుక అక్రమ రావాణా జరుగుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. అనుమతి లేకుండా ఇసుకను రవాణా చేస్తే తప్పకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. సరిహద్దు ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీస్ సిబ్బందితో నిఘా ఏర్పాటు చేసి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తాం.
– లింగమూర్తి, తానూరు తహసీల్దార్
Comments
Please login to add a commentAdd a comment