సర్వే పారదర్శకంగా చేపట్టాలి
భైంసాటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేలో బీసీ జనాభాను తక్కువ చేసి చూపిందని, సర్వే పారదర్శకంగా చేపట్టాలని బీసీ, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో కోమల్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేలో ఓసీ జనాభా ఎక్కువ చూపి బీసీలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ హక్కుల పరిరక్షణ సమితి ఉమ్మడి జిల్లా కన్వీనర్ పోశెట్టి, బీజేపీ నాయకులు తాలోడ్ శ్రీనివాస్, మల్లేశ్వర్, రావుల పోశెట్టి, జయశంకర్ సొసైటీ నాయకుల శ్రీనివాస్, లింగోజీ, గాలి రాజు, ప్రవీణ్ తదితరులున్నారు.
నిర్మల్‌చైన్‌గేట్: దేశ జన గణనలో కుల గణన చేపట్టాలని బీసీ హక్కుల సాధన సమితి నాయకులు కో రారు. బీసీల సమస్యలు పరిష్కరించాలని బీసీ హ క్కుల సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీల కు 50 శాతం చట్టసభల్లో రిజర్వేషన్ బిల్లు పెట్టి అమలు చేయాలని కోరారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, బీసీ సంక్షేమ అభివృద్ధి కోసం బడ్జెట్‌లో రూ.2లక్షల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీ జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని, వృత్తిదారులకు సబ్సిడీ రుణాలు, అన్ని జిల్లాల్లో బీసీ భవనాలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. బీసీ అట్రాసిటీ చట్టాన్ని రూపొందించి అ మలు చేయాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.విలాస్, జిల్లా కార్యవర్గ సభ్యుడు భూక్య రమేశ్, బీసీ హక్కుల సంఘం నాయకులు ఎన్.శ్రీనివాసచారి, శ్రీనివాసవర్మ, కాల్వ నర్సయ్య, వెంకటస్వామి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment