![ఘనంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06nrl127r-340026_mr-1738868842-0.jpg.webp?itok=nTrxs404)
ఘనంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
దిలావర్‌పూర్: మండలంలోని కాల్వపరిసర అటవీప్రాంతంలో వెలిసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని కోనేటి పరిసరాల్లో ధ్యాన హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు గురువారం అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విగ్రహ, ధ్యాన కేంద్ర దాత ఆయిండ్ల చంద్రమోహన్‌రెడ్డి దంపతులు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు మహాగణపతి పూజ, యజ్ఞహోమా ది కార్యక్రమాలు నిర్వహించారు. ధ్యాన ఆంజనేయ స్వామివారి ప్రాణప్రతిష్ఠ ప్రాంగణంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాజేశ్ మీనన్, అదనపు డీఎస్పీ ఉపేంద్రారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment