మాట్లాడుతున్న ధన్‌పాల్ సూర్యనారాయణ
సుభాష్‌నగర్: నగరంలోని ఆర్యవైశ్య నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటానని, వారి ఉన్నతికి సహకరిస్తానని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు ధన్‌పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని ఆర్యనగర్‌లో ఆర్యవైశ్య సంఘం నూతన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ.. ధన్‌పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నానని తెలిపారు. ఆర్యవైశ్యుల్లోని ఎంతోమంది నిరుపేదలు ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నారని, వారిని ఆదుకునేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని కోరారు. నిరుపేద ఆడపిల్లల పెళ్లిళ్లకు ట్రస్ట్ ఆధ్వర్యంలో సూరన్న పెళ్లి కానుక పేరిట ఉచితంగా పుస్తెమట్టెలు, బట్టలు అందజేస్తున్నామన్నారు. శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం సభ్యులు కాలనీల్లో సంఘాలు ఏర్పాటు చేసుకుంటే ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.2 లక్షలు అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు కొండ వీరశేఖర్ గుప్త, మాణిక్ భవన్ అధ్యక్షుడు ధన్‌పాల్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment