![- - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/29/28nzt703-250041_mr_0.jpg.webp?itok=kkE4aG3s)
సుభాష్‌నగర్: తెలంగాణ సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని రాష్ట్ర రోడ్లు, భవనా ల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చా రు. అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చే స్తూ, పల్లెపల్లెన తెలంగాణ ప్రగతిని ఆవిష్కరింపజే యాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సహకారంతో పనిచేస్తూ దశాబ్ది ఉ త్సవాలు విజయవంతం చేసేందుకు కృషిచేయాలన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆదివారం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎ మ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, జెడ్పీ చైర్మన్ విఠల్ రా వు, టీఎస్‌డబ్ల్యూసీడీఐ చైర్‌పర్సన్ ఆకుల లలిత, మేయర్ నీతూ కిరణ్, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, ఇన్‌చార్జి సీపీ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి మంత్రి ప్రశాంత్‌రెడ్డి దశాబ్ది ఉత్సవ ఏర్పాట్లపై అధికారు లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశ మై వారికి దిశానిర్దేశం చేశారు. ఆరు దశాబ్దాలకు పై గా అలుపెరుగని పోరాటం చేసి సాధించుకున్న తె లంగాణను సీఎం కేసీఆర్ తన దార్శనిక పాలనతో కేవలం తొమ్మిదేళ్లలోనే యావత్ దేశం ఆశ్చర్యపో యే రీతిలో అనేక రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు.
ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, అన్ని వర్గాల వారి కృషితో గడిచిన తొమ్మిదేళ్లలో రాష్ట్రం సాధించిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తోందన్నారు. శాఖల వారీగా కరపత్రాలు, ఫ్లెక్సీలు, బుక్‌లెట్ల ద్వారా ప్రజలకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. జూన్ 2వ తేదీ నుంచి 22 వరకు దశాబ్ది ఉత్సవాలు కొనసాగుతాయన్నారు. సమావేశంలో నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, చిత్రామిశ్రా, డీఎఫ్‌వో వికాస్ మీనా, జెడ్పీ సీఈవో గోవింద్, డీఆర్‌డీవో చందర్ తదితరులు పాల్గొన్నారు.
‘దశాబ్ది’ సంబురాలు ఘనంగా నిర్వహించాలి
అధికారులు, ప్రజాప్రతినిధులకు
మంత్రి ప్రశాంత్‌రెడ్డి పిలుపు
Comments
Please login to add a commentAdd a comment