నిజామాబాద్: బ్యూటీపార్లర్ కోర్సుకు మార్కెట్‌లో ఎంతో డిమాండ్ ఉందని, కోర్సు పూర్తి చేసిన తర్వాత స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుందని ఎస్‌బీఐ సీనియర్ మేనేజర్ శాంసన్ అన్నారు. ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ (ఆర్‌ఎస్‌ఈటీఐ) అధ్వర్యంలో బ్యూటీపార్లర్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. వాటి నిర్వహణ ద్వారా పలువురు ఆర్థికంగా స్థిరపడ్డారని సంస్థ డైరక్టర్ సుంకం శ్రీనివాస్ తెలిపారు. శిక్షణ అనంతరం బ్యాంక్‌ల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. అనంతరం చీఫ్ మేనే జర్‌ను సన్మానించారు. ఫ్యాకల్టీ రామకృష్ణ, నవీన్, రంజిత్, భాగ్యలక్ష్మీ, ప్రణీత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment