![మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్ విఠల్‌రావు - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/7/06nzr204-250078_mr.jpg.webp?itok=8Acdhss8)
మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్ విఠల్‌రావు
నిజామాబాద్ రూరల్: చార్జీలు లేకుండా ప్లాట్లను క్రమబద్ధీకరించాలని జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారంటీలను అమలు చేయాలని, ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితం చేయాలన్నారు. తెలంగాణ అభివృద్ధికి బీఆర్‌ఎస్ ఎంతో కృషిచేసిందని, మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తాము ఇప్పటికీ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. తప్పుడు హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. నగర మేయర్ దండు నీతూకిరణ్, జెడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్, సుమనారెడ్డి, భారతి, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment