గుంతల రహదారికి మరమ్మతులు చేపట్టరూ..
ఇందల్వాయి: ఇందల్వాయి–ధర్పల్లి రోడ్డు మార్గం పూర్తిస్థాయిలో మరమ్మతులకు నోచుకోకపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు నిత్యం అనేక ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్ల క్రితం రోడ్డు పునర్ నిర్మాణ పనులు జరిగినా ఎల్లరెడ్డిపల్లె–అన్సాన్పల్లి గ్రామాల మధ్య అక్కడక్కడ పనులు పూర్తవలేదు. దీంతో గుంతలమయంగా మారింది. ఈ రోడ్డుపై ఇప్పటికే పలు ప్రమాదాలు జరిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయాల పాలయ్యారు. ఇకనైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయించాలని వాహనదారులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment