దైవ దర్శనం కాకుండా కుట్ర పన్నారు
మోర్తాడ్(బాల్కొండ): కార్తీక పౌర్ణమి రోజున తనకు లింబాద్రి గుట్ట లక్ష్మి నర్సింహాస్వామి దర్శనం కాకుండా కుట్ర పన్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన లింబాద్రి గుట్ట వద్ద మాట్లాడారు. పదేళ్లుగా ఎమ్మెల్యే, మంత్రి హోదాలో ప్రతి జాతర, రథోత్సవం రోజున తాను గుట్టకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నానని ఆయన చెప్పారు. శుక్రవారం ఉద్దేశ పూర్వకంగా ట్రాఫిక్ జామ్ అయ్యేలా చేసి తన కాన్వాయ్‌ను అడ్డుకున్నారని ఆరోపించారు. గతంలో ఎప్పుడూ ట్రాఫిక్ జామ్ కాలేదని ఈ రోజు రెండు కిలోమీటర్ల వరకు వాహనాలు ఆగిపోవడం చూస్తుంటే తాను సమయానికి చేరుకోకుండా కావాలని చేశారని ఆరోపించారు. ట్రాఫిక్‌లో తన వాహనాల శ్రేణి ఇరుక్కునిపోవడంతో రెండు కిలోమీటర్లు నడిచి గుట్టకు చేరుకున్నానని చెప్పారు. ఎవరి పైశాచిక ఆనందం కోసం పోలీసులు ఇలా వ్యవహరించారు అని ప్రశ్నించారు. ఈ అంశంపై ఆర్మూర్ ఏసీపీకి తన అసంతృప్తిని వెల్లడించినట్లు ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీ, కలెక్టర్, రాష్ట్ర డీజీపీలకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment