పేదలను కుటుంబ సభ్యులుగా భావించాలి
ఆర్మూర్: పేదలను తమ కుటుంబ సభ్యులుగా భావించి విధులు నిర్వహించాలని ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందికి సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాన్ని గురువారం అర్ధరాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులకు, పార్టీ కార్యకర్తలకు సైతం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తనిఖీలు నిర్వహించిన ఆయన ప్రభు త్వ ఆస్పత్రిలో రోగులతో మాట్లాడి వైద్య సేవలు అందుతున్న తీరును తెలుసుకున్నారు. విధులకు హాజరైన సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. బస్టాండ్‌లో ప్రయాణికులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రయాణికులతో కలిసి చాయ్ తాగా రు. ప్రయాణ ప్రాంగణంలో సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ సిబ్బందికి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment