సన్నాలపై చిన్న చూపు..!
● క్వింటాలుకు రూ. 300 తగ్గింపు
● ఎండిన ధాన్యానికీ ధర తక్కువే
● ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు
బాల్కొండ: సన్నరకం ధాన్యం పై వ్యాపారులు చి న్న చూపు చూస్తున్నారు. ఫలితంగా రైతులకు ధరాఘాతం తప్పడం లేదు. సన్న రకం పచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రా వడం లేదు. ఒకవేళ కొన్నా ధరను అమాంతం తగ్గిస్తున్నారు. ప్రస్తుత ఖరీ ఫ్ సీజన్‌లో కోతలు కోయకముందే వ్యాపారులు పంట పొలాల వద్దకు వచ్చి వడ్లు కావలంటూ రైతు ల చుట్టూ తిరిగారు. ఇలా కోతలు కోయగానే అలా కాంటాలు చేశారు. క్వింటాలుకు పచ్చి ధాన్యాన్నే రూ. 2370 లకు కొను గోలు చేశారు. ఇప్పుడు క్వింటాలుకు రూ. 2050 తగ్గించారు. సు మారు కింటాలుకు రూ. 300 తగ్గించారు. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల వద్దకు వచ్చి కొనుగోలు చేసి న వ్యాపారులు ప్రస్తుతం డి మాండ్ లేదంటూ ధర తగ్గించడం పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం వ్యాపారులు సిండికేట్‌గా మారి ధాన్యం ధరను తగ్గించారని ఆరోపిస్తున్నారు.
ఆరబెట్టిన ధాన్యం..
సన్న రకం ఆర బెట్టిన ధాన్యానికి కూడా వ్యాపారులు ధరను తగ్గించారు. గతంలో క్వింటాలుకు రూ. 2500 పైగా పలికిన ధర ప్రస్తుతం రూ. 2300 లోపు పలుకుతోంది. ప్రభుత్వం ధాన్యం ధర తగ్గకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నా రు. కొనుగోలు కేంద్రాల్లో కొర్రీలు పెట్టడం వలన రైతులు వెళ్లడం లేదు. కేంద్రాల్లో సకాలంలో కాంటా లు కావడం లేదంటున్నారు. ఏ గ్రేడు ధాన్యానికి రూ. 2,320, సాధారణ రకానికి క్వింటాలుకు రూ. 2300 మద్దతు ధర ప్రభుత్వం అందిస్తోంది. కొర్రీలను భరించలేక రైతులు క్వింటాలుకు రూ. 100 తక్కువకే వ్యాపారులకు అమ్ముకుంటున్నారు.
వడ్ల ధరను తగ్గించారు..
సన్నరకం వడ్ల ధరను వ్యాపారులు తగ్గించారు. క్వింటాలుకు రూ. 2050 లకు కూడా కొనుగోలు చేయడం లేదు. పచ్చి వడ్లు అవసరం లేదంటున్నారు. ఆరబెట్టిన వాటికి కూడ ధర దక్కడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో కాంటాలు కావడం లేదు. – ప్రజ్వల్, రైతు, రెంజర్ల
Comments
Please login to add a commentAdd a comment