రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు అద్దెభారం
అర్బన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో
వసతుల లేమి..
నిజామాబాద్ అర్బన్ రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయం రెండో అంతస్తులో ఉంది. ప్రతి నిత్యం వందల సంఖ్యలో మహిళలు, వృద్ధులు రిజిస్ట్రేషన్ల నిమిత్తం వస్తూ పోతుంటారు. గతంలో 80 నుంచి 100 వరకు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యేవి. ప్రస్తుతం 50 నుంచి 60 వరకు సగటున డాక్యుమెంట్లు జరుగుతున్నా యి. ఒక్కో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఆరుగురికి తక్కువ కాకుండా ప్రజలు వస్తుంటారు. అంతేగాకుండా రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, కూర్చోవడానికి అనువైన స్థలం కూడా లేదు. గంటల తరబడి నిలబడటానికి వృద్ధులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.
● అర్బన్‌లో ప్రతినెలా
రూ.40 వేలకుపైనే కిరాయి
● రెండంతస్తులపైకి మెట్లు ఎక్కలేక
ప్రజల ఇక్కట్లు
● వివాదాలతో ఐడీవోసీలోకి రిజిస్ట్రేషన్ ఆఫీస్ మార్పు యోచన..?
సుభాష్‌నగర్: జిల్లాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. రూ.వేలల్లో ప్రతినెలా కిరాయి చెల్లిస్తుండటం ప్రభుత్వానికి భా రంగా మారింది. ఈ భారాన్ని తగ్గించుకునే యోచనలో అధికారులు ప్రత్యామ్నాయమార్గాలు అన్వేషి స్తున్నారు. ఈనేపథ్యంలో నిజామాబాద్ అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని శాశ్వత భవనంలోకి తరలించనున్నట్లు సమాచారం. దీంతో జిల్లా కేంద్రంలోని డాక్యుమెంట్ రైటర్లకు మరో షాక్ తగలనుంది. ఇప్పటికే దస్తావేజు లేఖర్లకు ఎలాంటి లైసెన్సులు లేవని, ప్రభుత్వ గుర్తింపు కూడా లేదని అధికారులు తేల్చేశారు. అద్దె భారంతో పాటు ఇతర ఖర్చులను తగ్గించుకునే చర్యలకు అధికారులు పూనుకున్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో జరుగుతున్న వివాదాలపై కలెక్టర్ దృష్టి సారించారు. వరుస వివాదాలతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల మార్పు అంశం కూడా తెరపైకి వస్తోంది.
భారం తగ్గించుకునే పనిలో..
జిల్లాలో నిజామాబాద్ అర్బన్, రూరల్, ఆర్మూర్, భీంగల్, బోధన్‌లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అందులో నిజామాబాద్ అర్బన్, రూరల్, భీంగల్, బోధన్‌లో అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. భీంగల్‌లో కార్యాలయ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్, రూరల్ కార్యాలయాలు నగరం నడిబొడ్డున ఉండటంతో అద్దెలు భారీగా ఉన్నాయి. ఒక్క అర్బన్ కార్యాలయానికి రూ.40 వేలకుపైనే, రూరల్ కార్యాలయానికి రూ.20వేల వరకు ప్రతినెలా అద్దె చెల్లిస్తున్నట్లు తెలిసింది. మిగతా కార్యాలయాల తరలింపుపై కూడా అధికారులు దృష్టిసారించారు.
కలెక్టరేట్‌లోకి..
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహిస్తున్నారు. అదే మాదిరిగా నిజామాబాద్‌లో కూడా ఈ శాఖను కలెక్టరేట్‌లోకి తర లించనున్నట్లు తెలుస్తోంది. గతంలోనే ఈ కార్యాలయాన్ని మారుస్తారని అధికారులు ప్రయత్నించి, విరమించుకున్నారు. ఐడీవోసీలోకి మార్చకపోవడానికి గల ఆంతర్యమేంటోనని అప్పట్లో పలు అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. తాజాగా రిజిస్ట్రేషన్ అధికారులు, డాక్యుమెంట్ రైటర్లకు మధ్య వివాదంతో మరోసారి కార్యాలయం మార్చే అంశం తెరపైకి వచ్చింది. కలెక్టరేట్‌కు రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని మారిస్తే ఇలాంటి వివాదాలకు తావుండదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. డాక్యుమెంట్లు సైతం నిష్పక్షపాతంగా జరిగే అవకాశముంది. ఏమైనా అవకతవకలు జరిగితే వెంటనే కలెక్టర్ దృష్టికి బాధితులు తీసుకెళ్లే ఆస్కారం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment