ఇందూరు తిరుమల క్షేత్రంలో ఔషధ సేవలు
మోపాల్: మోపాల్ మండలంలోని నర్సింగ్ పల్లిలో గల ఇందూరు తిరుమలలో పౌర్ణమి సందర్భంగా గర్భిణులకు ఉచిత ఔషధ సేవ కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి నిర్వహించారు. అదే విధంగా ఏడాదిలో కేవలం కార్తిక పౌర్ణమి రోజు మాత్రమే ఇచ్చే ఆస్తమా నివారిణి, ఆస్తమా నిరోధిని అయిన దివ్య ఔషధాన్ని సాయంకాలం భక్తులకు ఉచితంగా ఇచ్చారు. అస్తమా రుగ్మత ఉన్నవారికి, అస్తమా భవిష్యత్తులో రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా ఈ ఔషధాన్ని ప్రసాదంగా ఆలయంలో అందించామని ఆలయ ధర్మకర్త నర్సింహారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వేదపండితులు సంపత్ కుమారాచార్య, రోహిత్ కుమారాచార్య, గ్రామస్తులు నర్సారెడ్డి, నరాల సుధాకర్, రమేష్, మారుతి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
2.36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
సుభాష్‌నగర్: జిల్లాలో 543 కొనుగోలు కేంద్రాల ద్వా రా 2,36,588 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ అంబదాస్ రాజేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. 1,51,877 మెట్రిక్ టన్నులు సన్నరకాలు కాగా, 1,645 మెట్రిక్ టన్నులు కామన్, 83,066 మెట్రిక్ టన్నులు దొడ్డు రకాలు సేకరించామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా గన్నీ బ్యాగులు, లారీల కొరత లేకుండా, కడ్తా, తరుగు దోపిడీ జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్రాల వద్ద ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అంబదాస్ రాజేశ్వర్ రైతులను కోరారు.
నగరంలో నేటి నుంచి
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ
నిజామాబాద్ నాగారం: నిజామాబాద్ ఆఫీ సర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నగరంలోని క్లబ్ ప్రాంగణంలో రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ శని, ఆదివారాల్లో నిర్వహిస్తున్నట్లు క్లబ్ కార్యదర్శి చిలివేరి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం క్లబ్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ టోర్నీకి రాష్ట్రంలోని అన్ని జిల్లాల క్రీడాకారులు హాజ రు అవుతారని పేర్కొన్నారు. క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీయడానికి టోర్నీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్లబ్ సంయుక్త కార్య దర్శి వెంకట్ రాములు, గంగకిషన్, బి.డి దాస్, కిరణ్ కుమార్ గౌడ్, అంగిరేకుల సా యిలు, డాకం సాయిలు, డాక్టర్ రాములు, అరవింద్, రచ్చ మురళి, ఆశా నారాయణ, వీరేందర్ పర్మర్, శ్రీహరి పాల్గొన్నారు.
విద్యార్థులకు
వ్యాసరచన పోటీలు
నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్ర గ్రంథాల యంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవా ల సందర్భంగా శుక్రవారం పాఠశాల విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించా రు. ‘ప్రస్తుత టెక్నాలజీ – విద్యా విధానం’ అంశంపై పోటీలు నిర్వహించారు. సు మారు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజిరెడ్డి, అధికారులు తారకం, బుగ్గారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment