సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: భారతదేశ తూర్పు, పశ్చిమ తీరానికి మధ్యలో భౌగోళికంగా కీలకమైన ప్రాంతంలో ఉన్న నిజామాబాద్ జిల్లా మరోవైపు ఉత్తర భారతానికి, దక్షిణ భారతానికి గేట్‌వేలాగా ఉంది. అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులు సమృద్ధిగా పండించే జిల్లాగా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలోనే ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని డిచ్‌పల్లి వద్ద ‘ఇన్‌ల్యాండ్ కంటెయినర్ డిపో’ (కంటెయినర్ ఫ్రైట్ స్టేషన్) ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న దేశంలోనే నవరతన్ కంపెనీగా ఉన్న కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మూడేళ్ల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది.
నిజామాబాద్ చాంబర్ ఆఫ్ కామర్స్ 2015 సంవత్సరం నుంచి దీనికోసం ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో 2018లో నిజామాబాద్ చాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు విన్నవించారు. దీంతో ‘ఫెడరేషన్ ఆఫ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్లు జిల్లాలో సర్వే చేశారు. తర్వాత ‘ఫెడరేషన్ ఆఫ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ ఆర్గనైజేషన్’ వారు మరోసారి రీసర్వే చేశారు. నిజామాబాద్ ప్రాంతం ‘హై స్ట్రాటజికల్ అండ్ జియోగ్రాఫికల్ లొకేషన్’లో ఉందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖకు నివేదిక ఇచ్చారు. ‘ఆజాదీ కా అమృత్’ మహోత్సవాల్లో భాగంగా చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ ఉన్నతాధికారులను కలిశారు. దీంతో కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ జీఆర్ శేషగిరిరావు 2022 సెప్టెంబర్ 28న నిజామాబాద్‌కు వచ్చి కంటెయినర్ ఫ్రైట్ స్టేషన్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇది ఏర్పాటు చేస్తే వెంటనే డ్రైపోర్టు సైతం కేంద్రం ఏర్పాటు చేసేందుకు మార్గం సగమం అవుతుంది.
డ్రైపోర్టు ఏర్పాటైతే ఇక్కడి నుంచి
నేరుగా అంతర్జాతీయ ఎగుమతులు
జిల్లాలో సాగయ్యే పసుపు,
మొక్కజొన్న, సోయా, బియ్యం,
కూరగాయల రైతులకు మేలు
‘ఇన్‌ల్యాండ్ కంటెయినర్ డిపో’
ఏర్పాటుకు సిద్ధంగా ఉన్న కంటెయినర్
కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
లక్కంపల్లి సెజ్‌లో వ్యవసాయ
ఆధారిత యూనిట్లకు అవకాశం
Comments
Please login to add a commentAdd a comment