బాల్యవివాహాలను నిర్మూలిద్దాం
బోధన్‌టౌన్(బోధన్): బాల్య వివాహాలను నిర్మూలించి, బాలికలకు బంగారు భవిష్యత్‌ను ఇద్దామని డీహెచ్ఈడబ్ల్యూ జిల్లా మిషన్ సమన్వయ కర్త స్వప్న పిలుపునిచ్చారు. మహిళాశిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న ఉన్నత పాఠశాలలో ‘బాల్య వివాహ్ విముక్త్ భారత్’పై అవగాహన కల్పించారు. విద్యార్థులతో ర్యాలీ, మానవ హారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. బాల్యవివాహాల కారణంగా కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీవో రాధిక, సూపర్ వైజర్లు ఆసియా, లక్ష్మి, హెచ్ఎం బాల్‌చందర్, అంగన్వాడీ టీచర్లు పుష్ప, శ్యామల, కళావతి, జమున, రాణి, ఖనీస్, విద్యార్థినులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment