గేదెలకు పచ్చిగడ్డితో మేలు
మాక్లూర్: పచ్చి గడ్డితోనే పశువుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుందని జిల్లా పశుగణాభివృద్ది సంస్థ ఈవో డాక్టర్ మాజిద్ అన్నారు. మండలంలోని గుంజ్లిలో బుధవారం స్థానిక పశువైద్యాధికారులు కిరణ్‌దేశ్‌పాండే, ఉమా సహేర్ పర్యవేక్షణలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ నిర్వహించిన ఉచిత గర్భకోశవ్యాధి నివారణ చికిత్స శిబిరానికి మాజిద్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పశువులకు సరైన ఆహారం అందిస్తే అంచనాకు మించి పాలు ఇవ్వగలుగుతాయన్నారు. అనంతరం 22 పశువులకు గర్భకోశవ్యాధి నివారణ చికిత్స, 5 గేదెలకు కృతిమ గర్భధారణ చేయడంతోపాటు 24 దూడలకు నట్టల నివారణమందు తాగించి 15 పశువులకు సాధారణ చికిత్స అందించారు. పశువైద్య సిబ్బంది టి వినిత, ఆర్ కల్యాణి, అహ్మద్‌పాషా, పి శ్రీకార్, శ్యామల, పుష్ప, గంగాధర్, మహేశ్వరి, సుధీర్, పశువుల పెంపకందారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment