అట్టహాసంగా సీఎం కప్ జిల్లాస్థాయి టోర్ని
నిజామాబాద్‌నాగారం: గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విద్యార్థులు, యువతలో వివిధ క్రీ డల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు ప్రోత్సహించడానికి సీఎం కప్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్ తెలిపారు. సోమవారం పాత కలెక్టరేట్ మైదానంలో జిల్లాస్థాయి సీఎం కప్ టోర్నమెంట్
జిల్లా యువజన క్రీడల అధికారి ముత్తెన్న ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ముఖ్య అథితిగా హాజరైన తాహర్‌బిన్ హందాన్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 21 వరకు జరిగే వాలీబాల్, బాస్కెట్‌బాల్, కరాటే తదితర క్రీడా పోటీల్లో ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారన్నారు. ప్రభుత్వం క్రీడారంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందన్నారు. క్రీడల్లో రాణించిన వారికి నగదు ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ బాడ్సీ శేఖర్‌గౌడ్, వ్యాయామ సంఘం ప్రతినిధులు విద్యాసాగర్‌రెడ్డి, గోపిరెడ్డి, మల్లేష్‌గౌడ్, శంషోద్దిన్, రాజా గౌడ్, సురేందర్, ఉమేర్ తదితరులు పాల్గొన్నారు.
ఒలింపిక్ సంఘానికి చోటు లేదు
సీఎం కప్ ఆటల పోటీలలో ఒలింపిక్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులను ప్రొటో కాల్ లో మర్చిపోయారు. ఈ విషయంలో కలెక్టర్‌ను సంప్రదిస్తామని ఒలింపిక్ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. అంతే గాకుండా నూడా చైర్మన్ కేశ వేణు పేరు కూడా ఇన్విటేషన్ కార్డులో లేకపోవడంతో విమర్శలు వస్తున్నాయి.
పాత కలెక్టరేట్ క్రీడా మైదానంలో
ప్రారంభమైన పోటీలు
హాజరైన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్
Comments
Please login to add a commentAdd a comment