ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
నిజామాబాద్‌అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హను మంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 94 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, ఇన్‌చార్జి డీపీవో శ్రీనివాస్‌కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
డిప్యుటేషన్లు రద్దు చేయండి
ఉపాధ్యాయుల డిప్యుటేషన్లను రద్దు చేయా లని పీఆర్టీయూ తెలంగాణ నాయకులు సో మవారం ప్రజావాణిలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు కృపాల్‌సింగ్ మాట్లాడుతూ..
జిల్లా విద్యాశాఖలో వివిధ కేటగిరీల్లో డిప్యుటేషన్‌లలో కొనసాగుతున్న ఉపాధ్యాయులను వారి సొంత స్థానాల్లోకి తిరిగి పంపించాలన్నారు. ఇటీవల పదోన్నతులు, బదిలీలు, కొత్త ఉపాధ్యాయుల నియామకాలతో ఖాళీలు భర్తీ అయినట్లు తెలిపారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో సంఘం ప్రదాన కార్యదర్శి రవీందర్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment