అన్ని సరిచేసి స్లాట్ బుక్ చేసినా పని కావట్లేదు
నా పేరు సంతోష్ రెడ్డి. దుబాయ్‌లో ఉంటాను. మా నాన్న చనిపోతే అతని పేరు మీద ఉన్న మూడెకరాల భూమిని నా పేరు మీదికి మార్చుకునేందుకు రెవెన్యూ అధికారులను సంప్రదించి రూ. 8 వేలు ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకుంటే పావు గుంట విస్తీర్ణం పెరిగిందని అంటున్నారు. ఆ విస్తీర్ణం పెరగడానికి కారణం మేము కాదు కదా. అలాంటప్పుడు అధికారులు చేసిన తప్పులకు మమ్మల్ని ఎందుకు బాధ్యులను చేస్తారు. తొందరగా పని అవుతుందని దుబాయ్ నుండి వస్తే ఇలా జరిగింది. విలువైన సమయం, ప్రయాణ ఖర్చులు అన్ని వృథా అయ్యాయి. ఇకనైనా అధికారులు స్పందించి మా సమస్యలను తీర్చాలి.
– డీ.సంతోష్ రెడ్డి, నల్లవెల్లి
Comments
Please login to add a commentAdd a comment