విద్యాశాఖ కార్యాలయాలకు తాళాలు
మోర్తాడ్(బాల్కొండ): మండల కేంద్రాల్లోని విద్యా శాఖ కార్యాలయాల తాళాలు తెరిచేవారు కరువ య్యారు. పదకొండు రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యో గులు ఆందోళన చేస్తున్నారు. విద్యా వనరుల కేంద్రాల ను శభ్రం చేసేందుకైనా తెరవడం లేదు. తమ డి మాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు.
జిల్లాలో ఎంఐఎస్, సీఆర్‌పీ, మెస్సెంజర్‌లు, ఐఈఆర్‌పీలు, పీటీఐ, సీజీవీలు, కస్తూర్బా పాఠశా లల్లోని బోధన సిబ్బది మొత్తం 896 మంది సమ్మె లో పాల్గొంటున్నారు. తమకు పే స్కేల్ వర్తింప చేయాలని లేదా ఉద్యోగ భద్రత, రెగ్యులరైజ్ చే యాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు సమ్మె చేయగా వారికి అప్పుడు ప్రతిపక్ష పార్టీ కీలక నేతగా ఉన్న ఇప్పటి సీఎం రేవంత్‌రెడ్డి సంఘీభావం పలికారు. ప్రభుత్వం తలుచుకుంటే సాధ్యం కానిది ఏది లేదని ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను తాము అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా తమ డిమాండ్లను పరిష్కరించకపోవడంపై సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆందో ళనకు దిగారు.
మొదట్లో రెండు రోజులు శాంతియుత నిరసన తెలిపినా ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. మండల విద్యావనరుల కార్యాలయాల్లో ఒక్క ఎంఈవో మాత్రమే రెగ్యులర్ ఉద్యోగి, మిగిలిన ఉద్యోగులు అంతా సమగ్ర శిక్ష ఉద్యోగులే కావడం గమనార్హం. సమగ్ర శిక్ష ఉద్యోగులు మొత్తం సమ్మెలో పాల్గొంటుండటంతో మండల విద్యావనరుల కేంద్రాలకు తాళాలు తీసి శుభ్రం చేసేవారు కరువయ్యారు. ప్రభుత్వం స్పందించి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపాలని పలువురు కోరుతున్నారు.
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె
మండల విద్యా వనరుల కేంద్రాలను
తెరిచే వారు కరువు
డిమాండ్ల సాధన కోసం పదకొండు
రోజులుగా ఉద్యోగుల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment