ఇందల్వాయి: ప్రభుత్వం మారి ఏడాది గడుస్తున్నా ధరణి వెబ్‌సైట్ తీరు మాత్రం మారలేదు. గతంలో రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాలకు రైతులు అనేక తిప్పలు పడుతున్నారు. ధరణి వెబ్‌సైట్‌లో తప్పుడు వివరాల నమోదు కారణంగా కొత్తగా రిజిస్టేషన్‌లు చేసుకునే రైతులు, వారసత్వ మార్పిడి చే సుకునే రైతులకు అనేక సమస్యలు ఎదురవుతున్నా యి, సమయంతో పాటు డబ్బు వృథా అవుతోంది.
సమస్యలు ఇలా..
సర్వే నంబర్లలో విస్తీర్ణాన్ని హెచ్చు తగ్గులుగా నమోదు చేయడం, నమోదు చేసిన సర్వే నంబర్లకు డిజిటల్ సంతకాలు చేయకపోవడం వంటి ప్రధాన తప్పిదాల వల్ల రిజిస్టేషన్‌లకు, పట్టాదారుల మరణానంతరం వారసత్వ మార్పిడిలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సర్వే నంబర్లలో లోపాలు తెలియక స్లాట్ బుక్ చేసుకున్న రైతుల దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. అధికారులచే క్షుణ్ణంగా పరిశీలించిన దరఖాస్తులు కూడా చిన్న చిన్న తప్పిదాల మూలంగా తిరస్కరణకు గురవుతున్నాయి. ముందస్తుగా చెల్లించిన డబ్బులు కూడా ప్రభుత్వం తిరిగి చెల్లించడం లేదు.
అధికారుల తప్పులు : రైతులకు తిప్పలు
Comments
Please login to add a commentAdd a comment