తొమ్మది నెలలుగా తిరుగుతున్నా..
మా నాన్న చనిపోయి ఏడాది అవుతోంది. అతని పేరు మీద ఉన్న ఏడు ఎకరాల భూమిని నా పేరు మీద మార్చుకునేందుకు తొమ్మిది నెలలుగా తిరుగుతున్నా పని కావడం లేదు. ఒక సర్వే నంబరులో విస్తీర్ణం ఎక్కువగా ఉందని, మరొక సర్వే నంబరుకి డిజిటల్ సంతకం కాలేదని తిరస్కరించారు. చెల్లించిన రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 18 వేలు తిరిగి రాలేదు. అధికారులను సంప్రదించి తప్పులు సరి చేయించి పూర్తి వివరాలతో మరోసారి రూ. 18 వేలు చెల్లించి స్లాట్ బుక్ చేసుకొని ఆరు నెలలు అవుతోంది. తహసీల్దార్,ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాలఎ ఎన్ని మార్లు తిరిగినా పని కావట్లేదు. అధికారులు చేసిన తప్పులకు మేము శిక్ష అనుభవించాల్సి వస్తోంది. – గడ్డం గంగవ్వ, చంద్రాయన్‌పల్లి
Comments
Please login to add a commentAdd a comment